Wednesday, 4 February 2015

Bhagavatham poem no. 43

సీ !!  ఎవ్వనియవతార మెల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు
        నెవ్వని శుభనామమేప్రొద్దునుడువంగ సంసారబంధంబు సమసిపోవు
        నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువునెట్టు
         నెవ్వని పదనదినేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు
తే !! తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరగుగాంచిరి వసుదేవదేవకులకు
        నెవ్వడుదయించె తత్కధలెల్ల వినగ నిచ్చపుట్టెడు నెఱగింపు మిద్దచరిత.

Meaning :

కలియుగములో మనవులనేకమైన బాధలకు లోనవుతారు. శ్రీ కృష్ణుని చరితము వినాలనే సత్సంకల్పము సర్వ శుభదాయకము. మానవులు శ్రీ హరి యొక్క కథలను వింటూ, ఆరాదిస్తూ, ధ్యానిస్తూ, ఉంటే సంసార బంధం నుండి విముక్తులు కాగలరు.    

Friday, 30 January 2015

కృతి సమర్పణ

కృతి సమర్పణ:
హారికి నందగోకుల విహారికి( జక్ర సమీర దైత్య సం
హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్ట సంపదపహారికి ఘ ొ షకుటీ పయోఘృతా
హారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ !!
Meaning:

హారి, నంద గోకుల విహారీ, తృణా వర్థా రాక్షసుడిని సంహరించినవాడా!
భక్తుల దుఃఖాన్ని హరించు వాడా!
గొల్ల భామల మనుస్సులను దోచినవాడా!
దుష్ట సంపదలను అపహరించిన వాడా!
నంద గోకులము లోని ఇంటి లోని పాలు, వెన్న దొంగిలించి తిన్నవాడా!
పిల్లల పాలిటి పెను భూతమైన పూతన రాక్షసిని సంహరించినవాడా! ఓ శ్రీ కృష్ణ.

భాగవతములో చాలా శ్లోకాలు ఉన్నాయి. కాని దానిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఈ Blog లో ప్రస్తావిస్తున్నాను .  

Thursday, 29 January 2015

Pothana gari Bhagavatam

రామ గుణాభిరామ దినరాజకులాంబుధిసోమ తోయద
శ్యామ దశాననప్రబలసైన్య విరామ సురారిగోత్ర సు
త్రామ సూబాహు బాహు బలదర్పతమ: పటు తీవ్రధామ ని
ష్కామ కుభృల్లలామ గరకoట సతీనుత నామ రాఘవా !!

Meaning :

రామా,  గుణాభిరామ! సూర్యవంశ సాగరానికి చంద్రుని వంటి వాడా! నీలమేఘశ్యామా! రావణ సైన్యాన్ని అంతమొందించిన వాడా! పర్వతాల్లాంటి రాక్షసులను ఖండించే వజ్రాయుధ ధారీ! సూబాహువనే రాక్షసుడి బలదర్పం అనే అంధకారాన్ని అంతమొందించిన సూర్యుడి లాంటి వాడా! కోరికలు లేని వాడా! అవనీపతులలో అగ్రగణ్యుడా! పార్వతిచే స్తుతింప బడిన వాడా! రాఘవా! నీకు వందనములు. 

Wednesday, 28 January 2015

Pothana gari Bhagavatam

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన
విబుధ జనుల వలన విన్నoత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు !!

Meaning :

అయితే, చిత్రమే టoటే - శివుడే కానీ, బ్రహ్మ దేవుడే కానీ, ఈ భాగవత తత్త్వాన్ని చక్కగా, సమగ్రంగా చెప్పడానికి సమర్థులు కానప్పుడు, ఇక నాలాంటి సామాన్య మానవులుకు అది సాధ్యపడ్తుందా? అయినా, పెద్దలైన పండితుల నుండి విన్నుంత వరకు, నా మనో నేత్రానికి గోచరించినంతవరకూ, వాటిలో నాకు తెలియ వచ్చినంతవరకూ, వివరించిడానికి నేను ప్రయత్నిస్తాను.  

Tuesday, 20 January 2015

Pothana gari Bhagavatam

చేతులారంగ శివుని(   బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగాదలపడేని
కలుగనేటికి తల్లులకడుపు  చేటు

శ్రీమద్భాగవత రచన గురించి

పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే
పలికిన భవహర మగునట
పలికెద వేఱొoడు గాధ పలుకగ నేలా

Meaning :

నేను చెప్పబోయేదేమో భాగవతమట, పరమ పవిత్రమైన ఆ మహాపురాణమును నా చేత చెప్పించే విభుడు సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్ర ప్రభువేనట, నేనీ భాగవత గాధను చెప్తే సంసార బంధం తొలిగిపోతుందట, అందుచేత నేనీ భాగవతాన్నే చెప్తాను. ఇంకొక గాధను చెప్పడమెందుకు ?  

Monday, 19 January 2015

Pothana gari Daivasthuthi Poem7 Maha Lakshmi

హరికిన్ పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీగిరిసుతుల్ తోనాడు పూబోడి తా 
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా 
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ !!

Meaning :

శ్రీహరికి పట్టపు దేవియైన శ్రీదేవి, పుణ్యాల దీవి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, వాణీ శర్వాణులతో క్రీడించే పూబోణి, అరవింద మందిర, ముల్లోకాల్లోనూ పూజనీయురాలు, వెలుగు వీక్షణముతో దారిద్ర్యాన్ని తొలగించే తల్లియైన శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కల్యాణాలను, అనుగ్రహించుగాక!

Sunday, 18 January 2015

Pothana gari Daivasthuthi Poem6 Durga Bhavani

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!

Meaning :

అమ్మలందరికి అమ్మ, ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, అసురుల అమ్మ కడుపునకు చిచ్చు పెట్టిన అమ్మ, తన్ను మనస్సులో నమ్ముకొన్న దేవతల తల్లులయొక్క చిత్తములలో నిల్చియుండే అమ్మ, దయాజలనిధి అయిన మాయమ్మ దుర్గ భవాని నాకు మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలు నిచ్చు గాక !

Friday, 16 January 2015

Pothana gari Daivasthuthi Poem5 Talli Bharati

శారద నీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా
హారతుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది( గానగ నెన్నడు కల్గు భారతీ !!

Meaning :

శరన్మేషు మధ్య చంద్ర బింబమూ, కర్పూరము, స్పటికమూ, రాజ హంసలు, మల్లికలు, మంచు, నురుగు, వెండి కొండ, ఆది శేషువు, కుంద మందారాలు, పాల సముద్రము, పద్మ పుష్పము, ఆకాశ గంగల వలె స్వచ్ఛమై శుభాకారముతో నున్న నీ యొక్క సుందర మూర్తిని మదిలో నెప్పుడు చూడగలనో తల్లీ, భారతీ ! 

Tuesday, 13 January 2015

Pothana gari Daivasthuthi Poem4 Vinayaka

ఆదరమొప్ప మ్రోక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికి( బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
చ్చేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్
మోదకఖాదికిన్ సమద ముషక సాదికి సుప్రసాదికిన్ !!

Meaning :

హిమగిరి నందిని యొక్క హృదయానురాగాన్ని పొంది, కలి దోషాలను తొలగించి, ప్రపన్నుల నానందింపజేసి, ఆశ్రితుల   విఘ్నలతలను ఛేదించి, మధుర భాషణములు చేసి, అశేష జనులను ఆనందింప జేసి, మొదకాలను, ఆరగించి, మూషికమును అధిరోహించి, ముదమును కలిగించే వినాయక దేవునకు మ్రొక్కుతున్నాను. 

Saturday, 10 January 2015

Pothana Daivastuthi poem3 Brahma

ఆతతసేవసేసెద సమస్త చరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్లేతకు దేవతానికర నేతకు( గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ !!

Meaning :

చరాచర ప్రపంచాన్నంత చక్కగా సృష్టించు వాడు, సరస్వతీ స్వాంతానికి సంతోషం చేకూర్చెడి వాడు, వేదాలనన్నింటిని సమర్థంగా సమకూర్చిన వాడు, నాయకుడై దేవతలను ఆదుకొనేవాడు కల్మషాన్ని జయించిన వాడు, ఆశ్రితులను ఆదుకొనే వాడు, తపోధనులకు శుభాలను కలిగించు వాడు అయిన, బ్రహ్మ దేవుని నేను శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నాను. 

Friday, 9 January 2015

sri madhbhagavatam - Pothana gari Daivastuthi poem 2 Eswara

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవకేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికిన్
బాలశశాంక మౌళికి( గపాలికి మన్మధ గర్వపర్వతో
న్మూలికి నారదాదిముని ముఖ్య మన: సరసీరుహాళికిన్

Meaning :

చేతిలో త్రిశూలమును, మెడలో కపాల మాలను, శిరస్సున నెలవంకను, ధరించి, లీలా తాండవలోలుడైన పరమ శివునకు శిరస్సు వంచి, భక్తి పూర్వకంగా ప్రణామము చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు, పర్వత రాజు పుత్రి యొక్క ముఖ పద్మాన్ని ప్రపుల్లం కావించే ప్రభాకరుడు. నారదాది ముని సత్తముల చిత్త కమలములలో విహరించే మధుకరుడు.

Poet Pothana praises Lord Krishna, so I have kept heading Daivastuthi

sri madhbhagavatam - Pothana gari Daivastuthi poem 1 Krishna

శ్రీ కైవల్యపదంబు( జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేక  స్తంభకు( గేళిలోల విలసద్ద్రుగ్జాల సంభూతనా
నాకంజాత భవాండ కుంభకు మహా నందాంగనాడింభకున్

Meaning :

లోకరక్షణ కర్తవ్యాన్ని వహించిన వాడును, భక్త పరిపాలనమే ఒక కళగా చేపట్టి వినోదించేవాడు, దానవుల ఉద్రుతిని అరికట్టేవాడును, లీలావలోకనమాత్రము చేతనే బ్రహ్మాండాలను ఉద్భవింపజేసేవాడును, అయిన మహానందుని ఇల్లాలు ముద్దులబిడ్డడని శ్రీకైవల్యపదాన్ని పొందే కాంక్షతో నేను ధ్యానిస్తున్నాను.

Poet Pothana praises Lord Krishna, so I have kept heading Daivastuthi

Wednesday, 7 January 2015

Avataras mentioned in Bhagavatam

1.  ఆది పురుషావతారము                                                  15.  నార సింహావతారము
2.  సనక సనందాదుల అవతారము                                     16.  కూర్మావతారము
3. నారదావతారము                                                           17.  ధన్వంతరి ఆవతారము
4. వరాహవతారము                                                           18.  మోహినిఆవతారము
5. నరనారాయణవతారము                                                 19.  మత్స్యావతారము
6.  దత్తాత్రేయావతారము                                                     20. ప్రశ్నిగర్భావతారము
7.  హంసావతారము                                                           21.  వామనావతారము
8.  సుయజ్ఞావతారము                                                       22.  పరుశు రామావతారము
9.  కపిలావతారము                                                           23.  వేదవ్యాసావతారము
10. హయగ్రీవావతారము                                                    24.  శ్రీ రామావతారము
11. ఋషభావతారము                                                       25.  బలరామావతారము
12. ద్రువునకు దర్శనమిచ్చిన ఆవతారము                          26.  శ్రీ కృష్ణావతారము
13. పృధు చక్రవర్తి ఆవతారము                                           27.  బుధ్ధావతారము
14. గజేంద్రుని రక్షించిన ఆవతారము                                   28.  కల్కి ఆవతారము

We generally know only Dasha Avataras of Lord Vishnu. But in Bhagavata 28 Avataras mentioned. Poet wants give significance or emphasise, because, of the importance the personalities have. but Ten avataras which have higher significance are generally more popular as Dasha Avataras.

Bhagavatam = Vedam

నిగమ కల్పతరోర్గళితం ఫలం శుక ముఖాదమృతద్రవ సంయుతం !
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా: !!
Meaning :

శ్రీమద్భాగవతం వేదమనే కల్పవృక్షము నుండి ఆవిర్భవించినది. ఇది శుక యోగీoద్రుని ముఖము నుండి ద్రవించిన అమృత ఫలరసము, రసమయమైన ఆ భాగవతాన్ని రసిక భావుకులు తరింతురు గాక!


వేద కల్పవృక్ష విగిళతమై శుక ముఖసుధా ద్రవమున మొనసియున్న !
భాగవతపురాణఫలరసాస్వాదనపదవి గనుడు రసికభావవిదులు !!

Tuesday, 6 January 2015

Chatusloki bhagavatam poem 4

శ్రీమద్భాగవతము పరమాత్ముని నుండియే ఉద్భవించినది భగవానుడే బ్రహ్మ దేవునితో భాగవత రహస్యాన్ని నాలుగు శ్లోకాల్లో (చతు:శ్లోకీ భాగవతమును) ఇలాగా చెప్పాడు:

             1. అహమేవాసమే వాగ్రే, నాన్యద్యత్  సదసత్పరం !
                 పశ్చాదహం యదేతచ్చ, యో అవశిశ్యేత  సో అస్మ్య హం !!
సృష్టికి పూర్వము నేను ఒక్కడినే ఉంటిని.  తరువాతనూ నేనే ఉన్నాను. సకల చరాచర విశ్వాన్ని రచించి వ్యక్త పరచినదీ నేనే, లయము తరువాత మిగిలి యుండు వాడను నేనే.

             2. ఋతే ర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని !
                 తద్విద్యాత్ ఆత్మనో మాయాం  యధాభాసో యధాతమ: !!
నిజానికి లేనట్టిదే అయిననూ, ఆత్మయందు ఏది ప్రతీయమానము  అప్రతీయమానము అవుతుందో (ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను అనిపించడమ్, ఈ సృష్టి అంతానానుండియే ఉద్భవించునట్లు చూపడం ) అది నా మాయా శక్తియే.

             3. యధా మహంతి భూతాని,భూతేషుచ్చావచేష్వను !
                ప్రవిష్టాన్యప్రవిష్టాని తధా తేషు న తేష్వహం !!
సృష్టిలోని సకల వస్తు ప్రపంచములోనూ, పంచ మహా భూతాలు ప్రవేశించి ఇమిడియున్నను, అవి కనిపించవు.  అలాగే నేను కూడ సర్వ భుతాలయందు ఆత్మ రూపములో ప్రవేశించి, సర్వగతుడైన యున్ననూ, కనిపించకుండా ఉంటాను.

             4. ఏతావదేవ జిజ్ఞాస్యం, తత్త్వ జిజ్ఞాసు నాత్మన : !
                 అన్వయ వ్యతిరేకాఖ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా !!
సర్వత్రా,  సర్వదా, ఏది భోదితమైయుండునో ("ఎరుక " యందు ఉండునో) అట్టి దానిని అన్వయ వ్యతిరేక పద్దుతుల ద్వారా ఆత్మ యని గ్రహిచుము. (పరమ సత్స్వరూపమైన నా యొక్క ఈ ఆత్మతత్వము, అనాదిగా సర్వత్రా వ్యాపించియున్నది. సర్వంఖల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని సువిచారము ద్వారా తెలుసుకొని అనుభూతి చెందాలి. )




             

Monday, 5 January 2015

Nava Bhakti vidhanam poem 3

 శ్రీ  విష్ణో: శ్రవణే పరీక్షిదభవద్వైయాసకి : కీర్తనే
ప్రహ్లాద: స్మరణే, తదంఘ్రి భజనే లక్ష్మి:, పృధు: పూజనే 
అక్రూరస్త్యభివందనే, కపిపతిర్దాస్యే, చ సఖ్యే అర్జున:
సర్వస్వాత్మసమర్పణే బలి రభుత్ కృష్ణాప్తి రేవంవిధా. 

Meaning :

 శ్రీ విష్ణు గాధా శ్రవణముచే పరీక్షిత్తు, కీర్తనచే వ్యాస పుత్రుడైన శుకుడు, స్మరణచే ప్రహ్లాదుడు, పాద సేవచే లక్ష్మీదేవి, పూజలచే పృధు చక్రవర్తి, అభివందనముచే అక్రూరుడు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యముచె అర్జునుడు, సర్వస్వము ఆత్మ సమర్పణ చేసి బలి చక్రవర్తి, ఈ నవవిధ భక్తులచే క్రుతార్థులైనారు.  శ్రీ విష్ణు భక్తి ఇంత గొప్పది.         
Nava Bhakti vidhanam to reach Sri Vishnu:
1. King Parikshit - By listening to Story of Sri Vishnu
2. Muni Shuka (Son of Vyasa)- By chanting, praising Sri Vishnu
3. Bhakta Prahlada - By remembering Sri Vishnu (as we all know, Prahlada always had confidence in lord Sri Vishnu. What ever punishment he gets, overcomes by Bhakti in Sri Vishnu)
4. Goddess Lakshmi Devi - By Seva of Sri Vishnu
5. King Prudhu - By Pooja of Sri Vishnu
6 Akrura - By Abhivandanam
7 Hanuman - By slavery to Rama
8 Warrior Arjuna - By friendship
9. Chakravarthy Bali - By Sarvasamatma samarpana (He has given everything including his soul to Sri Vishnu)

I do not know why Narada Muni is left in this; may be he is above all these. Wherever he go he will chanting Narayana, Narayana. It may be in Kailasam, Brahmalokam, Swargam, Narakam or on Earth.

Saturday, 3 January 2015

Dasavaratam poem 2


వేదాన్   ఉద్దరతే,    జగన్నివహతె   భూగోళముద్బిభ్రతే
దైత్యాన్ దారయతే, బలిం ఛలయతే, క్షత్రక్షయం కుర్వతే      
పౌలస్త్యం జయతే హలం కలయతే, కారుణ్య మాతన్వతే
మ్లేచ్చాన్ మూర్చయతే, దశాకృతికృతే, కృష్ణాయ తుభ్యం నమః

Meaning :

వేదాలను ఉద్దరించినవాడు, జగత్తును ధరించినవాడు, భూమండలాన్ని పైకెత్తినవాడు, దైత్యుని చీల్చినవాడు, బలిని  అణచినవాడు, క్షత్రియులును నశింప జేసిన వాడు. రావణుని జయించిన వాడు, హలము త్త్రిప్పినవాడు, కరుణను  పెంచినవాడు, మ్లేచ్చూలను పడగొట్టిన వాడు అయిన శ్రీ కృష్ణ భగవానుకు నమస్కారములు.                                 
Poet is giving Namaskar by praising the wonderful things done in Dasavarathams:
1. Fish (Matsyavatara) - Protected four vedas
2. Turtle (Kurmavathara) - Helped to lift Mountain while churning Milky sea.
3. Varaham (Varahavatara) - Lifted world Earth from deep sea,
4. Lion (Narasimha) - Killed Daitya
5. Vamana - Subdued Bali Chakravarthy
6. Parusarama - Killed Kshatriyas
7. Rama - Conquered Ravana, Kumakarna adhi
8. Krishna - Plough
9. Lord Budda - Enlightened one and all.
10. Kalki - yet to come

Friday, 2 January 2015

About Bhagavatam poem1

సదా సేవ్యా సదా సేవ్యా శ్రీ మద్భాగవతా కధా ! యస్యా : శ్రవణ మాత్రేణ హరి : చిత్తం సమాశ్రయేత్ "

Meaning :

శ్రీ మద్భాగవత కథను సదా సేవిస్తుండాలి. సదా స్మరిస్తుండాలి. శ్రవణం చేసినంతనే, శ్రీహరి శ్రోత హృదయం లో విరాజిల్లుతాడు. దేవతలకు సైతము లభ్యము కానిది ఈ భాగవతామ్రుతము. 

One should always serve, recollect Srimadbhagavata Story. If you just listen, Sri Hari will flourish in your Heart. the Bhavata Amrutha is not even available to Gods also.