Tuesday, 6 January 2015

Chatusloki bhagavatam poem 4

శ్రీమద్భాగవతము పరమాత్ముని నుండియే ఉద్భవించినది భగవానుడే బ్రహ్మ దేవునితో భాగవత రహస్యాన్ని నాలుగు శ్లోకాల్లో (చతు:శ్లోకీ భాగవతమును) ఇలాగా చెప్పాడు:

             1. అహమేవాసమే వాగ్రే, నాన్యద్యత్  సదసత్పరం !
                 పశ్చాదహం యదేతచ్చ, యో అవశిశ్యేత  సో అస్మ్య హం !!
సృష్టికి పూర్వము నేను ఒక్కడినే ఉంటిని.  తరువాతనూ నేనే ఉన్నాను. సకల చరాచర విశ్వాన్ని రచించి వ్యక్త పరచినదీ నేనే, లయము తరువాత మిగిలి యుండు వాడను నేనే.

             2. ఋతే ర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని !
                 తద్విద్యాత్ ఆత్మనో మాయాం  యధాభాసో యధాతమ: !!
నిజానికి లేనట్టిదే అయిననూ, ఆత్మయందు ఏది ప్రతీయమానము  అప్రతీయమానము అవుతుందో (ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను అనిపించడమ్, ఈ సృష్టి అంతానానుండియే ఉద్భవించునట్లు చూపడం ) అది నా మాయా శక్తియే.

             3. యధా మహంతి భూతాని,భూతేషుచ్చావచేష్వను !
                ప్రవిష్టాన్యప్రవిష్టాని తధా తేషు న తేష్వహం !!
సృష్టిలోని సకల వస్తు ప్రపంచములోనూ, పంచ మహా భూతాలు ప్రవేశించి ఇమిడియున్నను, అవి కనిపించవు.  అలాగే నేను కూడ సర్వ భుతాలయందు ఆత్మ రూపములో ప్రవేశించి, సర్వగతుడైన యున్ననూ, కనిపించకుండా ఉంటాను.

             4. ఏతావదేవ జిజ్ఞాస్యం, తత్త్వ జిజ్ఞాసు నాత్మన : !
                 అన్వయ వ్యతిరేకాఖ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా !!
సర్వత్రా,  సర్వదా, ఏది భోదితమైయుండునో ("ఎరుక " యందు ఉండునో) అట్టి దానిని అన్వయ వ్యతిరేక పద్దుతుల ద్వారా ఆత్మ యని గ్రహిచుము. (పరమ సత్స్వరూపమైన నా యొక్క ఈ ఆత్మతత్వము, అనాదిగా సర్వత్రా వ్యాపించియున్నది. సర్వంఖల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని సువిచారము ద్వారా తెలుసుకొని అనుభూతి చెందాలి. )




             

No comments:

Post a Comment