Monday, 22 May 2017

*త్యాగయ్య*

తెర తీయగా రాదా లోని 
తిరుపతి వెంకటరమణ! మచ్చరమను 

పరమపురుష! ధర్మాదిమోక్షముల
పారఁదోలుచున్నది నాలోని

ఇరవొందగ భుజియించు సమయమున 
ఈగ తగులు రీతి యున్నది
హరిధ్యానము సేయు వేళ చిత్తము 
అంత్యజు వాడకుఁ బోయిన ట్లున్నది 

మత్స్యము ఆకలిఁగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది 
అచ్చమైన దీపసన్నిధి మరు
గిడఁ బడి చెఱచిన ట్లున్నది

వాగురయని తెలియక మృగగణములు 
వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన 
త్యాగరాజనుత మదమత్సర మను 
             *త్యాగయ్య*

Tyagaraja Swamy was ardent devotee and writer, singer. He added Bhakti, Karma in his songs. Through his songs he tried to change the society towards Dharma.

Though he belongs to Karnataka, he traveled all places and had darshan of all gods.

When he came to Tirumala for darshan of Lord Balaji, a curtain was between Tyagayya and Lord, may be due to Sevas (Nivedyam time), but he took to his to heart. Actually curtain is a Physical obstacle between him and God, but He thought it was obstacle.

If it is a Minister or some other VIPs, they would have ordered to remove the curtain. Even ordinary man, leave about VIPs, if Darshan is delayed, they will shout, gherao, or atleast scold the VIPs and others. But Tyagayya, instead, he took the pain and the responsibility for not having darshan.

Tyagayya sang 'arthiga' and the curtain automatically gone and had darshan of Lord.

He described the situation as While eating a fly coming in between
A fish, thinking of bait as food and get caught
Light of deepam is covered by some obstacle and full light is not there.
He lastly described 'madam and matsaram' are coming in between me and you, remove my 'madamatsaram' and make it happen of your darshan.
One most important thing we have to observe is he mentioned 'madamatsaram' as singular means both are one.
'madam and matsaram'    are 2 different, generally we will call 'madamatsaralu' .

Whatever I understood from the poem, written. If anything is not correct or understood in a different way, please inform me, I will correct myself. 

Monday, 8 May 2017

Vedanarayana



 వేదోద్థారకా మత్స్యావతారా వేదనారాయణ!
నాగులాపుర క్షేత్ర: సొమకాసుర వద, నారాయణ! 
హరిగొండపుర స్వయంభువు వేద రక్షణ!
శ్రీ కృష్ణ దేవరాయ ಸಪ್ತ ಪ್ರಾಕಾರಾ ನಿರ್ಮಾಣಾ! 

 The temple built by Sri Krishna Devaraya in Nagulapura. It's 35 km from Puttur and 75 km from Tirupati. Matsavatara and protected Vedas. So here God is known as Veda Narayana.


ఆంధ్రప్రదేశ్ లో మహావిష్ణువు వేద నారాయణ స్వామి అనే పేరుతో నాగులాపుర క్షేత్రంలో స్వయంభువుగా వెలశాడు. 

ఇది చెన్నై-తిరుపతి రహదారిలో ఊత్తూకోట్టై మార్గంలో పుత్తూరు నుండి 35 కి మి,  తిరుపతి నుంచి 75 కి మిల దూరంలో ఉంది. 

శ్రీ కృష్ణ దేవరాయలు హరిగొండపురంలో మత్స్యావతారా వేదనారాయణుని ఆలయం నిర్మించారు. తన తల్లి నాగులాంబ ఙ్గాపకార్ధం నాగులాపురమనే పేరు పెట్టారు. 

ఈ ఆలయం లో శ్రీదేవి భూదేవి సహిత మత్స్యావతారా విష్ణువు. ద్వారపాలకులుగా వినాయకుడు,  దుర్గ ఉన్నారు.  2007వ ఫిబ్రవరి నెలలో గరుత్మంతుని ప్రతిష్ఠ జరిగింది. 

మార్చిలో సూర్యుడు అస్తమించే సమయంలో మొదటి రోజు స్వామి మత్స్య పుచ్ఛం మీద,  రెండో రోజు నాభిపైన,  మూడో రోజు కిరీటం పైన కిరణాలు ప్రసరిస్తాయి.




శ్రీ కృష్ణ 

నీ కొరకు జప తపాదులు చేసినను దొరకదు దర్శనం. 

ఒక్కటంటే ఒక్కటే తులసి దళం చాలునా

పిడికెడంటే పిడికెడే అటుకులు చాలునా 

చిటికెన వేలు చాలునా గోవర్ధనగిరి మోయనా

ఉగ్గు పాలు చాలునా పూతనను చంపనా 
               వేం*కుభే*రాణి



Thursday, 4 August 2016

Krishna pushkaralu


కృష్ణా పుష్కరాలు

నీవారిలో మునుగు మావారి కరుణింప
దేవతలు నీ మహిమ కైవార మొనరింప
గురుడు కన్యారాశి కరుదెంచు శుభవేళ
విరబూచునంట పుష్కరము నే కెరటాల

గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి !
నర్మదే సింధు కావేర్యో జలే అ స్మిన్ సన్నిధింకురు !!

నమామి సుకృతశ్రేణీమ్ కృష్ణవేణీం తరంగిణీమ్
యద్వీక్షణం కోటిజన్మకృతదుష్కర్మ శిక్షణమ్ !

పుణ్య పరంపరలు గల కృష్ణ నదిని చూచినంత మాత్రాన్నే జన్మలో చేసిన పాపాలు హరిస్తావో అటువంటి నదీమతల్లి కు నమస్కారాలు.

నాదాన్ని సృష్టించేది కాబట్టి నది


శ్రీ కృష్ణాలహరి

అపి శ్రీకృష్ణే తే మహిమ పరపారం వ్రజతి కో
న శేషో శేషాస్త్యైరపి కథయితుం వా ప్రభవతి,
అతో హ్రీతో వాచశ్శుచయ ఇహ వచ్మ్యల్పకమిదం
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.

స్వాభావికమైన ఐశ్వర్యాది షడ్గుణాలతో శోభించేది కృష్ణా నది. వేయి ముఖాలున్న ఆది శేషునికి కూడా నీ మహిమ చెప్పా తరం కాదు. నా మనస్సుకు గోచరించిన చిన్న పద్యాన్ని చెబుతున్నాను, నీకివే నా నమస్కారములు.

 అలక్ష్యం తే రూపం వచన హృదయాద్వాతిగమతో
నతోహం తే లక్ష్యం కధమపి చ విజ్ఞాయ వరదే,
ప్రవృత్తస్త్వామ్ స్వమతిగతితస్తే వరముదే
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.

శివ విష్ణు స్వరూపమైన కృష్ణా నదియే శ్రీ దత్తాత్రేయ మూర్తి కి ప్రీతి పాత్రమని ప్రసిద్ధం. భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. అట్టి భగవత్ కటాక్ష్యాన్ని సంపాదించాలంటే కృష్ణ నది తీరంలో నివాసం చేయాలి. నది తీర్థం యొక్క స్నాన పానాదులచే అంతఃకరణం శోదించ బడుతుంది. తద్వారా భగవంతుని జ్ఞానం కలుగుతుంది.


న చ ప్రాజ్యం న చ విబుధపూజ్యం సురపదం
పదం పూష్ణో జిష్ణోరపి మమ న విష్ణో రభిమతం,
మతం దత్తాత్రేయ ప్రపద పరిపుతం తవ తటం
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.

నేను పెద్ద కోరికలను కోరాను. పెద్ద పెద్ద పదవులను కోరను. పెద్ద పెద్ద స్థానాలను కోరను. కోరానన్నాను కదా అని కోరికలేమి లేవని కాదు. నన్ను ఆధ్యాత్మిక, దైవిక, భౌతిక తాపత్రయరహితుడు, జ్ఞాననిష్ఠుడు గా చేయుము.
స్వయముగా పుష్కర పర్వము గల తుంగభద్రా నది కూడా ఈ కృష్ణా నదిలో లీనమవుతున్నది.


గతే జీవే కన్యాం జగతి బహుమాన్యాం శిఖరిణీ
హాసహ్యే త్వామ్ ధన్యాం జనని భగినీ వామరసరిత్,
సమాగత్యాప్యబ్దం పరమనియమాత్ తిష్ఠతి ముదా
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.
బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశించగా ఈ పుష్కర మహా పర్వము నందు ఎవరు కృష్ణ సేవకు వెళతాడో, అతనికి ఆయుష్యము, ఆరోగ్యము, మహా ఐశ్వర్యము కలుగటయే గాక ధర్మ స్థితిని కూడా పొందగలడు.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొర్లుతాయి

కృష్ణవేణితి యో బ్రుయాత్
సప్తజన్మార్తితాన్యపి
మహాపాపాని నశ్యంతి
విష్ణులోకం స గచ్చతి !!
ఏ మానవుడు జీవితంలో ఒక్కసారి "కృష్ణవేణి" అని స్మరిస్తాడో, ఒక్కసారి కృష్ణా నది స్నానమాచరిస్తాడో వాని జన్మజన్మల పాపాలు పటాపంచలై పోవడమే గాక అతడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు.


వర లక్ష్మి వ్రతం

సర్వమంగళసంపూర్ణా సర్వైశ్వర్యసమన్వితా !
ఆద్యాదిశ్రీ ర్మహలక్ష్మీ స్త్వత్కలా మయి తిష్ఠతు !!
అందరికి వర లక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

























Wednesday, 4 February 2015

Bhagavatham poem no. 43

సీ !!  ఎవ్వనియవతార మెల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు
        నెవ్వని శుభనామమేప్రొద్దునుడువంగ సంసారబంధంబు సమసిపోవు
        నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువునెట్టు
         నెవ్వని పదనదినేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు
తే !! తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరగుగాంచిరి వసుదేవదేవకులకు
        నెవ్వడుదయించె తత్కధలెల్ల వినగ నిచ్చపుట్టెడు నెఱగింపు మిద్దచరిత.

Meaning :

కలియుగములో మనవులనేకమైన బాధలకు లోనవుతారు. శ్రీ కృష్ణుని చరితము వినాలనే సత్సంకల్పము సర్వ శుభదాయకము. మానవులు శ్రీ హరి యొక్క కథలను వింటూ, ఆరాదిస్తూ, ధ్యానిస్తూ, ఉంటే సంసార బంధం నుండి విముక్తులు కాగలరు.    

Friday, 30 January 2015

కృతి సమర్పణ

కృతి సమర్పణ:
హారికి నందగోకుల విహారికి( జక్ర సమీర దైత్య సం
హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్ట సంపదపహారికి ఘ ొ షకుటీ పయోఘృతా
హారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ !!
Meaning:

హారి, నంద గోకుల విహారీ, తృణా వర్థా రాక్షసుడిని సంహరించినవాడా!
భక్తుల దుఃఖాన్ని హరించు వాడా!
గొల్ల భామల మనుస్సులను దోచినవాడా!
దుష్ట సంపదలను అపహరించిన వాడా!
నంద గోకులము లోని ఇంటి లోని పాలు, వెన్న దొంగిలించి తిన్నవాడా!
పిల్లల పాలిటి పెను భూతమైన పూతన రాక్షసిని సంహరించినవాడా! ఓ శ్రీ కృష్ణ.

భాగవతములో చాలా శ్లోకాలు ఉన్నాయి. కాని దానిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఈ Blog లో ప్రస్తావిస్తున్నాను .  

Thursday, 29 January 2015

Pothana gari Bhagavatam

రామ గుణాభిరామ దినరాజకులాంబుధిసోమ తోయద
శ్యామ దశాననప్రబలసైన్య విరామ సురారిగోత్ర సు
త్రామ సూబాహు బాహు బలదర్పతమ: పటు తీవ్రధామ ని
ష్కామ కుభృల్లలామ గరకoట సతీనుత నామ రాఘవా !!

Meaning :

రామా,  గుణాభిరామ! సూర్యవంశ సాగరానికి చంద్రుని వంటి వాడా! నీలమేఘశ్యామా! రావణ సైన్యాన్ని అంతమొందించిన వాడా! పర్వతాల్లాంటి రాక్షసులను ఖండించే వజ్రాయుధ ధారీ! సూబాహువనే రాక్షసుడి బలదర్పం అనే అంధకారాన్ని అంతమొందించిన సూర్యుడి లాంటి వాడా! కోరికలు లేని వాడా! అవనీపతులలో అగ్రగణ్యుడా! పార్వతిచే స్తుతింప బడిన వాడా! రాఘవా! నీకు వందనములు. 

Wednesday, 28 January 2015

Pothana gari Bhagavatam

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన
విబుధ జనుల వలన విన్నoత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు !!

Meaning :

అయితే, చిత్రమే టoటే - శివుడే కానీ, బ్రహ్మ దేవుడే కానీ, ఈ భాగవత తత్త్వాన్ని చక్కగా, సమగ్రంగా చెప్పడానికి సమర్థులు కానప్పుడు, ఇక నాలాంటి సామాన్య మానవులుకు అది సాధ్యపడ్తుందా? అయినా, పెద్దలైన పండితుల నుండి విన్నుంత వరకు, నా మనో నేత్రానికి గోచరించినంతవరకూ, వాటిలో నాకు తెలియ వచ్చినంతవరకూ, వివరించిడానికి నేను ప్రయత్నిస్తాను.