Thursday, 4 August 2016

Krishna pushkaralu


కృష్ణా పుష్కరాలు

నీవారిలో మునుగు మావారి కరుణింప
దేవతలు నీ మహిమ కైవార మొనరింప
గురుడు కన్యారాశి కరుదెంచు శుభవేళ
విరబూచునంట పుష్కరము నే కెరటాల

గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి !
నర్మదే సింధు కావేర్యో జలే అ స్మిన్ సన్నిధింకురు !!

నమామి సుకృతశ్రేణీమ్ కృష్ణవేణీం తరంగిణీమ్
యద్వీక్షణం కోటిజన్మకృతదుష్కర్మ శిక్షణమ్ !

పుణ్య పరంపరలు గల కృష్ణ నదిని చూచినంత మాత్రాన్నే జన్మలో చేసిన పాపాలు హరిస్తావో అటువంటి నదీమతల్లి కు నమస్కారాలు.

నాదాన్ని సృష్టించేది కాబట్టి నది


శ్రీ కృష్ణాలహరి

అపి శ్రీకృష్ణే తే మహిమ పరపారం వ్రజతి కో
న శేషో శేషాస్త్యైరపి కథయితుం వా ప్రభవతి,
అతో హ్రీతో వాచశ్శుచయ ఇహ వచ్మ్యల్పకమిదం
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.

స్వాభావికమైన ఐశ్వర్యాది షడ్గుణాలతో శోభించేది కృష్ణా నది. వేయి ముఖాలున్న ఆది శేషునికి కూడా నీ మహిమ చెప్పా తరం కాదు. నా మనస్సుకు గోచరించిన చిన్న పద్యాన్ని చెబుతున్నాను, నీకివే నా నమస్కారములు.

 అలక్ష్యం తే రూపం వచన హృదయాద్వాతిగమతో
నతోహం తే లక్ష్యం కధమపి చ విజ్ఞాయ వరదే,
ప్రవృత్తస్త్వామ్ స్వమతిగతితస్తే వరముదే
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.

శివ విష్ణు స్వరూపమైన కృష్ణా నదియే శ్రీ దత్తాత్రేయ మూర్తి కి ప్రీతి పాత్రమని ప్రసిద్ధం. భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. అట్టి భగవత్ కటాక్ష్యాన్ని సంపాదించాలంటే కృష్ణ నది తీరంలో నివాసం చేయాలి. నది తీర్థం యొక్క స్నాన పానాదులచే అంతఃకరణం శోదించ బడుతుంది. తద్వారా భగవంతుని జ్ఞానం కలుగుతుంది.


న చ ప్రాజ్యం న చ విబుధపూజ్యం సురపదం
పదం పూష్ణో జిష్ణోరపి మమ న విష్ణో రభిమతం,
మతం దత్తాత్రేయ ప్రపద పరిపుతం తవ తటం
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.

నేను పెద్ద కోరికలను కోరాను. పెద్ద పెద్ద పదవులను కోరను. పెద్ద పెద్ద స్థానాలను కోరను. కోరానన్నాను కదా అని కోరికలేమి లేవని కాదు. నన్ను ఆధ్యాత్మిక, దైవిక, భౌతిక తాపత్రయరహితుడు, జ్ఞాననిష్ఠుడు గా చేయుము.
స్వయముగా పుష్కర పర్వము గల తుంగభద్రా నది కూడా ఈ కృష్ణా నదిలో లీనమవుతున్నది.


గతే జీవే కన్యాం జగతి బహుమాన్యాం శిఖరిణీ
హాసహ్యే త్వామ్ ధన్యాం జనని భగినీ వామరసరిత్,
సమాగత్యాప్యబ్దం పరమనియమాత్ తిష్ఠతి ముదా
నమః శ్రీకృష్ణే తే జయ శమితతృష్ణే గురుమతే.
బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశించగా ఈ పుష్కర మహా పర్వము నందు ఎవరు కృష్ణ సేవకు వెళతాడో, అతనికి ఆయుష్యము, ఆరోగ్యము, మహా ఐశ్వర్యము కలుగటయే గాక ధర్మ స్థితిని కూడా పొందగలడు.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొర్లుతాయి

కృష్ణవేణితి యో బ్రుయాత్
సప్తజన్మార్తితాన్యపి
మహాపాపాని నశ్యంతి
విష్ణులోకం స గచ్చతి !!
ఏ మానవుడు జీవితంలో ఒక్కసారి "కృష్ణవేణి" అని స్మరిస్తాడో, ఒక్కసారి కృష్ణా నది స్నానమాచరిస్తాడో వాని జన్మజన్మల పాపాలు పటాపంచలై పోవడమే గాక అతడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు.


వర లక్ష్మి వ్రతం

సర్వమంగళసంపూర్ణా సర్వైశ్వర్యసమన్వితా !
ఆద్యాదిశ్రీ ర్మహలక్ష్మీ స్త్వత్కలా మయి తిష్ఠతు !!
అందరికి వర లక్ష్మి వ్రత శుభాకాంక్షలు.